Mihira Magazine – Telugu (1 Year Subscription, Print and Online editions)

500.00

మిహిర మాసపత్రిక ప్రతినెలా మీకు పుస్తకరూపంలోను మరియు PDF గాను పంపబడుతుంది.

Note: The printed edition of Mihira is temporarily not available as printing has been stopped due to COVID. The online edition of the magazine will be sent to your email address every month. We will resume postal delivery of the print editions soon.

Thank you for your understanding.

మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు లోకానికి వెలుగు పంచుతాడు. ‘మిహిర’ పాఠకలోకానికి జ్ఞానాన్ని పంచుతుంది. సూర్యుడి కిరణాలు ఏడు. అశ్వాలు ఏడు. మిహిర లోని కిరణాలు కూడా ఏడు.

దివ్యకిరణం: దివ్యులు, సిద్ధులు, గురువులు మొదలైన వారి గురించిన రచనలు ఈ విభాగంలో ఉంటాయి. పర్వదినాలు, ఉత్సవాలు, వాటి అంతరార్థాలని కుడా ఇందులోనే తెలుసుకోవచ్చును. ఇందులో ఉపశీర్షికలుగా సాన్నిధ్యం, సంస్మరణం, ఉత్సవం మొదలైనవాటిని చూడవచ్చును.

ఆత్మకిరణం: ఆత్మజ్ఞానాన్ని మార్గాలైన కర్మ, యోగ, జ్ఞాన, భక్తి మాగాలకు సంబంధించిన వ్యాసాలుండులో ఉంటాయి. దర్శనాలు ఉపనిషత్తులు మొదలైనవి కూడా ఇందులోనే ఉంటాయి. ఆయా మార్గాల పేర్లే ఉపశీర్షికలు.

ప్రాణకిరణం: ఆరోగ్యానికి సంబంధించిన విభాగం ఇది. స్వస్థవృత్తం, శికిత్స మొదలైన ఈప్సిర్షికలలో ఆరోగ్యానికి సంబంధించిన సనాతన, నూతన శాస్త్రాలిందులో పరిచయం చేయబడతాయి. పరిశీలించబడతాయి.

ఉల్లాసకిరణం: మనస్సు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి. ఇది కళలు కావ్యాలు, నాటకాలు, మొదలైన ప్రక్రియలద్వారా లభిస్తుంది. అవే ఈ విభాగంలో ఉంటాయి. సంగీతము, నాట్యము మొదలైన అంశాలకి సంబంధించిన రచనలు కూడా ఇందులోనే చోటు చేసుకుంటాయి. కావ్యామృతం, నాదసుధనాదాసుధ, కథ మొదలైనవి ఇందులో ఉపశీర్షికలు.

వికాసకిరణం: ఈ విభాగంలో విడిదరకాలైన రచనలు మానసిక, బౌద్ధిక,వికాసానికి, తోడ్పడతాయి. ఇందులో స్త్రీ పర్వం స్త్రీలకు, బాలకాండ పిల్లలకు, వానప్రస్థం వృద్దులకు, యువతరంగం యువకులకు ప్రత్యేకంగా చెందినవి. ఇంకా వ్యాసపీఠం శీర్షికలో ఆసక్తికరమైన వ్యాసమాలికలు ప్రచురించబత్తాయి.

వివేకకిరణం: ఈ విభాగంలో వివేకానికి, ఆలోచనకి, తత్త్వానికి సంబంధించిన విషయాలు ఇవ్వబడతాయి. ధర్మం గురించి, సంఘం గురించి మనకు కలిగే సందేహాలకు సమాధానాలు పరిప్రశ్నలో లభిస్తాయి.

జ్యోతిషాకిరణం: జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన పరిచయవ్యాసాలు, పరిశోధన వ్యాసాలు, వాటితో పాటు మీ పుట్టినరోజు మా కానుక, భవిష్యపురాణం ఇలాంటివెన్నో ఉంటాయి.

ఈ ప్రణాళిక ననుసరించి వివిధ విషయాలపై రచనలని ఆహ్వానిస్తున్నాం!